A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నమ్మకం లేకపోతే ఓటు వేయకండి- కెటిఆర్
Share |
December 10 2018, 9:17 am

మంత్రి కెటిఆర్ చేసిన ఒక ప్రకటన అత్యంత ఆసక్తికరంగా ఉంది. తనకన్నా ప్రతిపక్షాల అభ్యర్ధులే సమర్దులని బావిస్తే వారికే ఓటు వేయండని ఆయన అన్నారు. నియోజకవర్గ ప్రజలకు తాను నచ్చకపోతే ఓటు వేయనవసరం లేదని ఆయన అన్నారు. పేదోళ్ల ముఖంలో ఇంకా చిరునవ్వులు కనిపించాలంటే తనకు మరోసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని, ఇంతకు పదింతలు అభివృద్ధి చేసి చూపిస్తానని కెటిఆర్ అన్నారు.సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 2009 ఎన్నికల్లో తొలిసారి సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయగా 171 ఓట్ల మెజార్టీ తో బయటపడ్డానని, ఇప్పుడు కార్యకర్తలు లక్ష మెజార్టీని అందిస్తామంటుంటే పదేళ్లలో జరిగిన మార్పు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
దీనికంతటికీ కారణం కేసీఆర్‌ ఇచ్చిన ఆత్మ విశ్వాసమేనని పేర్కొన్నారు. ఒకప్పుడు సిరిసిల్ల అంటే ఉరిసిల్లగా చెప్పుకునేవారని.. ఇప్పుడు నేత కార్మికులు నెలకు రూ.20 వేలు సంపాదించే స్థితికి చేరుకున్నారని వివరించారు.

tags : ktr, votes

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info