విధానపరమైన అంశాలపై మంత్రులు సమాధానం చెప్పాలి, కానీ ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు చెప్పడమేంటని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిది, మాజీ మంత్రి కె.పార్దసారది ప్రశ్నించారు. తాము బాండ్లపై ఇతరత్రా అడుగుతున్న ప్రశ్నలకు మంత్రులు ఎందుకు జవాబు ఇవ్వలేకపోతున్నారని ఆయన అన్నారు. సీఆర్డీఏ 10.75 శాతంకు రెండు వేల కోట్ల రూపాయలు సేకరించి గొప్పలు చెబుతుందని విమర్శించారు. 10.50 శాతం కన్నా తక్కువ వడ్డీకి అప్పులు తేగలరా అని కుటుంబరావు సవాల్ చేస్తున్నారని, ఈ సవాల్‌కు తాము సిద్దమని పార్థసారథి స్పష్టం చేశారు. కుటుంబరావు స్థాయి మరిచిపోయి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో కుటుంబరావు ఉన్నాడని అనుమానం కలుగుతుందన్నారు. అగ్రిగోల్డ్ కుంభకోణంలో ఒక్క బాధితుడికి కూడా న్యాయం జరగలేదన్నారు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. tags : pardhasaradhi, kutumbarao