A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చెవిలో పూలు,చేతిలో చిప్ప- బిజెఇ నిరసన
Share |
June 16 2019, 2:01 am

విజయవాడలో బిజెపి యువమోర్చా కార్యకర్తలు విన్నూత్న నిరసన చేశారు. చెవిలోపూలు, చేతిలో చిప్పతో వారు ఈ నిరసన చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్‌కు తప్ప రాష్ట్రంలో మరొకరికి ఉద్యోగం రాలేదనివారు విమర్శించారు. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ.. ఈ నిరసనకు దిగారు. చెవిలో పూలు, చేతిలో చిప్ప పట్టుకుని భిక్షాటన చేశారు.చంద్రబాబు అధికారంలోకి రాకముందు ఇంటికో ఉద్యోగం, రెండు వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికి వరకు ఒక ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 1000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

tags : bjp, protest

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info