A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్,టిడిపి సీట్ల పంపిణీ తేలేనా
Share |
October 16 2018, 10:52 am

తెలంగాణలో కాంగ్రెస్,టిడిపి ల మద్య సీట్ల పంపిణీ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టిడిపి అదినేత జోక్యం చేసుకుంటే కాని తెగేలా లేదని రాజకీయ వర్గాలు భావివ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ గతసారి 15 సీట్లు గెలిచింది.అలాగే పదహారు సీట్లలో రెండో స్థానంలో వచ్చింది. అందువల్ల 31 సీట్లను ఇవ్వాలని టిడిపి కోరుతోంది.కాని కాంగ్రెస్ అందుకు సిద్దంగా లేదు. పన్నెండు సీట్లు ఇవ్వడానికి సిద్దంగా ఉంది. లేదంటే మహా అయితే పదిహేను వరకు ఇవ్వవచ్చని అంటున్నారు.కాగా కాంగ్రెస్ కు అవసరమైన ఆర్దిక సాయం బాద్యత కూడా చంద్రబాబే చూస్తారని,అందువల్ల ఇంకొన్ని సీట్లు కోరవచ్ని చెబుతున్నారు.అలాగే సిఐఐ ఏడు సీట్లు కోరుతోంది.జనసేన కూడా ముప్పై సీట్ల వరకు డిమాండ్ పెట్టినా, వీరందరికి కలిపి 29 సీట్లు ఇచ్చి ,నికరంగా 90 సీట్లలో పోటీచేయాలన్నది కాంగ్రెస్ ఉద్దేశంగాఉంది.అయితే కూటమిలోని పార్టీలకు ఇచ్చే ఇరవైతొమ్మిది సీట్లలో పాతబస్తీలో ఎమ్.ఐ.ఎమ్ బలంగా ఉండే సీట్లు కూడా ఏడెనిమిది ఉండడం విశేషం.

tags : congress, tdp, seats

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info