A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీ అంటే చంద్రబాబుకు భయం
Share |
February 23 2019, 12:13 pm

ప్రదాన మంత్రి మోడీ ఇమేజీని దెబ్బతీయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర పన్నుతున్నాడని, ఈ విషయం ఎప్పుడో చెప్పామని బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.మోదీని చూస్తే చంద్రబాబుకి భయం పట్టుకుందనీ, తన నీడను చూసుకుని కూడా చంద్రబాబు భయపడుతున్నారని ఆయన అన్నారు. అవకాశవాద రాజకీయాలు చేసే చంద్రబాబు అవసరం కొద్ది పొత్తులు పెట్టుకుంటారని ఆయన అన్నారు.
బీజేపీకి కులం, మతం, రంగు లేదని ఉద్ఘాటించారు. కమ్యూనిస్టుల చరిత్రంతా విదేశీయులదేనని విమర్శలు గుప్పించారు. కోర్టు నోటీసులను బేఖాతరు చేస్తున్న చంద్రబాబు న్యాయవ్యవస్థను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. చంద్రబాబు ప్రచార దాహంతోనే 29 మంది మృతి చెందారనీ, గోదావరి పుష్కారాల్లో తొక్కిసలాటకు ఆయనే కారణమని ఆరోపించారు. ప్రమాద ఘటన పై జస్టిస్‌ సోమయాజులు కమిషన్ ఇచ్చిన నివేదిక అత్యంత దురదృష్టకరమని చెప్పారు. ముఖ్యమంత్రికి ధైర్యముంటే పుష్కరాల్లో తొక్కిసలాట ఘటన, విశాఖ భూ కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు కోరాలని కన్నా అన్నారు.

tags : kanna, modi,babu

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info