A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
యుపిలో ఎస్సి,బిఎస్పి కలిస్తే కష్టమే-సర్వే
Share |
October 16 2018, 11:12 am

ఉత్తరప్రదేశ్ లో సమాజవాది పార్టీ ,బహుజన సమాజవాది పార్టీ కలిస్తే బిజెపికి ఇబ్బందేనని మరో సర్వే వెల్లడించింది.ప్రదాని మోడీపై ఆదరణ ఉన్నా,ఈ కూటమి ఏర్పడితే బిజెపి కి మెజార్టీ సీట్లు రావడం కష్టమేనని ఆ సర్వే తెలిపింది.. 47% మంది ప్రాంతీయ పార్టీలు ఏకమైతే బీజేపీ ఇప్పుడున్న స్థానాల్లో కొన్నింటిని కోల్పోవాల్సి వస్తుందని అభిప్రాయపడగా.. 32% మంది కూటమి ప్రభావం ఉండదని.. 21% మంది చెప్పలేమని ఇండియా టుడ్ సర్వేలో అబిప్రాయపడ్డారు.ఇదే సర్వేలో యూపీలో 48% మంది మళ్లీ మోదీనే ప్రధానిగా కావాలని కోరుకోగా.. 22% మంది రాహుల్‌ గాంధీ వైపు మొగ్గుచూపారు. 9% మంది మాయావతి ప్రధాని కావాలని అభిప్రాయపడగా.. అఖిలేశ్‌కు 7% మంది ఓకే చెప్పారు. 80 ఎంపీ స్థానాలున్న యూపీలో 2014 ఎన్నికల్లో బీజేపీ 71 స్థానాల్లో విజయ దుందుభి మోగించి కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది.కాగా ముఖ్యమంత్రి యోగి కి ప్రజలలో నలబైమూడు శాతం ఆదరణ ఉందని వెల్లడైంది.

tags : up, survey

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info