అనంతపురం టిడిపి ఎమ్.పి జెసి దివాకరరెడ్డి మరో సారి వివాదాదస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు అనంతపురం జిల్లాకు చెందిన టిడిపి ఎమ్.ఎల్.ఎలు, ఎమ్.పి ఎవరూ మద్దతు ఇవ్వకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.ప్రభోదానంద స్వామి వివాదంలో కాని ,పోలీసు అదికారుల సంఘం కాని తనను ఒక్కరినే అనలేదని,అంరు ఎమ్మెల్యేలు, ఎమ్.పిలను ఉద్దేశించి అన్నారని ..అంటూ అభ్యంతర పదజాలం వాడారు. వారు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన తీవ్రంగా ప్రశ్నించారని టీవీలలో వార్తలు వస్తున్నాయి. కాగా ఉప ముఖ్యమంత్రి ,హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ జెసి పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు.అలాగే పోలీస్ అదికారుల సంఘం కూడా సంయమనం పాటించాలని అభిప్రాయపడ్డారు. tags : jc, mlas, slang