A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నాలుగేళ్లలో అమరావతి కట్టలేదే-కెటిఆర్ ఎద్దేవ
Share |
February 23 2019, 12:51 pm

తెలంగాణ ప్రాంత రైతుల నోట్లో మట్టి కొట్టడానికి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు యత్నించారని మంత్రి కెటిఆర్ అన్నారు.సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆయా అంశాలపై మాట్లాడారు.

టీఆర్‌ఎస్, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేద్దాం అనుకుంటున్నాం. కానీ కేంద్రం, ప్రధాని మోదీ అడ్డుకుంటున్నారని ఇటీవల చంద్రబాబు అన్నారు కదా?

మా ప్రాంత రైతుల నోట్లో మట్టి కొట్టాలనుకునే చంద్రబాబుతో కలిసి ఎట్లా పనిచేస్తాం? తెలుగువారు కలిసుండాలి. కానీ, తెలంగాణ ప్రయోజనాలకు భిన్నంగా పనిచేసే వారితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదు. చంద్రబాబు 30 ఉత్తరాలను ఉపసంహరించుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతారా?

టీఆర్‌ఎస్‌ పట్ల ప్రజల్లో విశ్వాసం ఉందనుకున్నానని, అసెంబ్లీ రద్దు ప్రకటన చూసిన తర్వాత టీఆర్‌ఎస్‌ పట్ల వ్యతిరేకత బాగానే కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు కదా?

చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటేనే టీఆర్‌ఎస్‌ మంచిదా? పొత్తు పెట్టుకోకపోవడంతో కాంగ్రెస్‌తో ఆయన పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. అందుకే టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సైతం చంద్రబాబు, లోకేశ్‌ ఇవే మాటలన్నారు. సైబరాబాద్, హైదరాబాద్‌ నేనే కట్టాను. కులీ కుతుబ్‌షా ఎవరో తెలియదన్నారు.
హైదరాబాద్‌ నేనే నిర్మించాను. నేను లేని హైదరాబాద్‌ ఊహించలేను అని చంద్రబాబు అన్నారు? 9 ఏళ్లలో హైదరాబాద్‌ను కట్టిన మహా నాయకుడు చంద్రబాబు.. 4 ఏళ్లలో అమరావతిని ఎందుకు కట్టలేకపోయారు? ఈ పాటికి అమరావతిని సింగపూర్‌ కంటే గొప్పగా కట్టొచ్చు కదా? ఎందుకు కట్టలేదు?

tags : ktr, amaravati

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info