A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు నాన్ వెజ్ బిర్యాని పంపుతారా
Share |
December 12 2018, 7:59 am

సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఒక జోక్ ను మంత్రి కెటిఆర్ వాడుకున్నారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోర్టుకు పలుమార్లు వెళ్లకపోతే నాన్ బెయిలబుల్ వారంట్ కాకుండా నాన్ వెజ్ బిర్యానీ పంపిసారా అని సోషల్ మీడియాలో జోక్ లు వస్తున్నాయని ఆయన అన్నారు. సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కెటిఆర్ ఈ విషయం ప్రస్తావించారు.ఆ ప్రశ్న..సమాదానం ఇలా ఉన్నాయి.

తెలంగాణ ప్రజల కోసం అనేక పోరాటాలు చేశానని, బాబ్లీ కోసం పోరాడకపోతే ఆ ప్రాజెక్టు ఆగేది కాదని, అందుకే ఈ రోజు కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అంటున్నారు?

చంద్రబాబు ఏ అవకాశాన్నీ వదులుకోకుండా రాజకీయాల కోసం వాడుకుంటారు. రెండేళ్లుగా ఆయన కోర్టు ఆజ్ఞలను ధిక్కరిస్తే నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ కాకుండా నాన్‌ వెజ్‌ బిర్యానీ పంపిస్తారా అని సోషల్‌ మీడియాలో జోకులు నడుస్తున్నాయి. నా మీద రైల్వే కోర్టుల్లో కేసులున్నాయి. ఉద్యమంలో మా మీద వందల కేసులు పెట్టారు. మేము కోర్టులకు వెళ్లలేదా? చట్టానికి అతీతుడిని అనుకుంటే ఎలా? తెలంగాణ ఉద్యమ తీవ్రతను తగ్గించడానికి ఆ నాడు బాబ్లీ అంశాన్ని పట్టుకుని ధర్మాబాద్‌ వెళ్లారు. 18 కేసుల్లో స్టే తెచ్చుకున్న చంద్రబాబు బాబ్లీ కేసులో కోర్టుకు వెళ్లేందుకు ఎందుకు ఉత్సాహం చూపుతున్నారు? మిగిలిన 18 కేసుల్లో సైతం స్టేను తొలగింపజేసుకుని విచారణను ఎదుర్కోవాలి. అని కెటిఆర్ అన్నారు.

tags : ktr, biryani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info