A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇక్కడ గెలిపించకపోతే క్యాబినెట్ లో చేరను
Share |
December 12 2018, 9:14 am

తాను తెలుగుదేశం పార్టీ నుంచి టిఆర్ఎస్ లోకి ప్రజల కోరిక మేరకే మారానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.తాను అవసరం కోసమో, అవకాశాల కోసమో రాజకీయాలను ఏనాడూ తార్పిడి చేయలేదని ఆయన అన్నారు. సత్తుపల్లిలో పార్టీ తగాదాలను తీర్చేందుకు ఆయన అక్కడ సమావేశం అయ్యారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడపాలంటే మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరముందన్నారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి నియోజకవర్గం కంటే సత్తుపల్లి నియోజకవర్గానికి అధిక ప్రాముఖ్యత ఉందని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు ఎన్నికలను నిర్లక్ష్యంగా తీసుకుంటే మరల రాబోయే కేబినేట్‌లో తను ఉండనని అన్నారు. కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన పథకాల వల్లే సత్తుపల్లి నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉందన్నారు.

tags : tummal, cabitnet

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info