A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
Share |
December 10 2018, 9:27 am

గతంలో కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాందీ ఎపికి వస్తే నల్లజెండాలతో నిరసన చెప్పిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉండదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిది అంబటి రాంబాబు ప్రశ్నించారు.చంద్రబాబు చౌకబారు రాజకీయాలు చేసే వ్యక్తి అని ఆయన ద్వజమెత్తారు. చంద్రబాబు టీఆర్‌ఎస్‌తో కలిసుందాం అనుకున్నారని చెప్పారని, అలాంటప్పుడు టీఆర్‌ఎస్‌ వ్యవహారాల్లో ఎందుకు తలదూర్చారని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన తర్వాత హైదరాబాద్‌ నుంచి ఎందుకు పారిపోయి వచ్చారని నిలదీశారు. ఈ కేసు తర్వాత చంద్రబాబు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఒక్కసారైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గతంలో రాష్ట్రానికి వస్తే నల్ల జెండాలతో నిరసన తెలిపిన టీడీపీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలన్నారు. చౌకబారు రాజకీయాలు చేసే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదన్నారు. హోదా కోసం కర్నూల్‌ జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నా ఎందుకు స్పందించడంలేదని దుయ్యబట్టారు. ధర్మాబాద్‌ అరెస్ట్‌ వారెంట్‌పై నానా హడావుడి చేస్తున్నారని, మహారాష్ట్ర కోర్ట్‌ నోటీసులు ఇస్తే ఇక్కడ ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

tags : ambati, rahul

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info