A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
Share |
June 16 2019, 2:15 am

ఎపి తాత్కాలిక సచివాలయం నిర్మాణ టెండర్ల దశ నుంచి అవకతవకలు జరిగినట్లు కాగ్ నిర్ధారించిందని కదనాలు వచ్చాయి. కాగ్ నివేదిక ప్రకారం రాజధాని అబివృద్ది సంస్థ ద్వారా పిలిచిన ఈ టెండర్లలో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయి.తాత్కాలిక సచివాలయంలోని 6 బ్లాకులను రెండేసి బ్లాకులుగా కలిపి 3 ప్యాకేజీలుగా టెండర్లను ఆహ్వానించారు. ఎల్‌అండ్‌టీ, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలు మాత్రమే టెండర్లు దాఖలు చేశాయి. ఈ రెండు సంస్థలు అంతర్గత అంచనా వ్యయంపై ఏకంగా 62 శాతం నుంచి 85 శాతం వరకు ఎక్సెస్‌కు టెండర్లను దాఖలు చేశాయి. టెండర్లను రద్దు చేయాల్సింది పోయి ఆ రెండు సంస్థలతో ప్రభుత్వం సంప్రదింపుల జరపడాన్ని కాగ్‌ తప్పుపట్టింది. సంప్రదింపుల తరువాత కూడా ఈ రెండు సంస్థలకు 16.24 శాతం నుంచి 24.75 శాతం ఎక్సెస్‌కు టెండర్లను ఖరారు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రెండు సంస్థలకు బిల్లుల చెల్లింపులోనూ నిబంధనల మేరకు ప్రభుత్వం వ్యవహరించలేదని కాగ్‌ వెల్లడించింది. నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ శాతం మేర బిల్లులు చెల్లించారని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఆర్‌డీఏ కమిషనర్‌ కాంట్రాక్టర్లకు రూ.40.80 కోట్ల అదనపు ప్రయోజనం కలిగేలా టెండర్లను ఖరారు చేసినట్లు కాగ్‌ తేటతెల్లం చేసింది. ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదని తెలిపింది.

tags : ap,secretariat

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info