A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
Share |
February 23 2019, 12:22 pm

మహారాష్ట్ర నుంచి కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసిన నేపద్యంలో తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు,నిరసనల ఆదారంగా కోర్టుదిక్కార పిటిషన్ వేయాలని బజిఎపి నేతలు భావిస్తున్నారు.ఈ విషయాన్ని ఆ పార్టీ ఎమ్.పి జివిఎల్ నరసింహారావు చెప్పారు. బాబ్లీ వ్యవహారంలో న్యాయవ్యవస్థను కించపరిచేలా సీఎం వ్యాఖ్యానించారని,ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లి దిక్కార పిటిషన్ వేయనున్నామని ఆయన చెప్పారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఈ పిటిషన్‌ సిద్ధమవుతోందని చెప్పారు. కోర్టులపై చంద్రబాబు, టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను న్యాయ నిపుణులకు చూపించామన్నారు. అలాగే ఏపీ అసెంబ్లీలో సీఎంపై సభా హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెడతామని జీవీఎల్‌ తెలిపారు. ముంబై హైకోర్టులో సీఎం చంద్రబాబుపై పిల్‌ వేయబోతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెనాలిలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం న్యాయవ్యవస్థను కించపరిచేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

tags : gvl, babu, court, contempt

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info