A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సోమయాజులు నివేదిక- జగన్ స్పందన
Share |
December 10 2018, 10:23 am

గోదావరి పుష్కరాలలో తొక్కిసలాటలో ఇరవైతొమ్మిది మరణించిన ఘటన మీద సోమయాజులు కమిషన్ ఇచ్చిన నివేదికపై విపక్ష నేత ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ స్పందించారు.
చంద్రబాబు నాయుడు చేసిన నిర్వాకం వల్ల పుష్కరాల్లో 29 మంది భక్తులు చనిపోతే దేవుడ్ని, ప్రజలను క్షమించమని అడగాల్సిందిపోయి కమిషన్‌తో తప్పుడు రిపోర్టు ఇప్పించుకున్నారని జగన్ ద్వజమెత్తారు. చంద్రబాబు చేతిలో ఉన్న కమిషన్‌తో తప్పుడు నివేదిక ఇప్పించుకుని భగవంతుడి దృష్టిలో, ప్రజల దృష్టిలో మరింత పలుచన అయ్యారని జగన్‌ అన్నారు. పుష్కరాలను రాజకీయాల కోసం వాడుకోవడం ఒక తప్పు అయితే.. దాని ద్వారా ప్రచార లబ్ది పొందడానికి సినిమా తీయించుకోవడం మరో తప్పని ఆయన వ్యాఖ్యానించారు. పుష్కరాల పనుల్లో అవినీతికి పాల్పడి తప్పుల మీద తప్పులు చేశారని.. చంద్రబాబు చర్యల వల్లనే అంతమంది భక్తులు ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

tags : jagan, somayajulu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info