A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి కొంప ముంచిన విష్ణుకుమార్ రాజు
Share |
December 10 2018, 9:24 am

ఎపి శాసనసభలో బిజెపి పక్ష నేత విష్ణుకుమార్ రాజు మరోసారి ఆ పార్టీ కొంప ముంచారు.కేంద్రానికి వ్యతిరేకంగా ,బిజెపిని తీవ్రంగా విమర్శిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తుంటే, తీర్మానం చేస్తుంటే, ఆయన కూడా మద్దతు ఇస్తున్టన్లు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూతాను ఆంధ్రుడునని, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకొనేందుకు సిద్ధంగా లేమని అన్నారు. ఏపీ పట్ల కేంద్రం వైఖరిపై తీవ్ర అభ్యంతరం తెలుపుతూ సభలో సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమర్థించారు. చంద్రబాబు చెప్పిన విషయాలను అర్థం చేసుకున్నామని, ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నామని తాము అనడంలేదని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. సీఎం ప్రవేశపెట్టిన తీర్మానంలో ఏపీకి అన్యాయం జరిగిఉంటే మౌనం వహిస్తూ తాము కూడా ఆమోదం తెలుపుతున్నామని సభలో రాజు చెప్పడం విశేషం.ఇంతకీ ఈయన బిజెపి నేతా?లేక టిడిపి నేతా?మరి మిగిలిన బిజెపి ఎమ్మెల్యేలు ఏమి చేస్తున్నట్లు?

tags : vishnukumar raju, bjp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info