A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తొక్కిసలాట- జడ్జి పై వైసిపి తీవ్ర విమర్శ
Share |
December 10 2018, 9:25 am

గోదావరి పుష్కరాలలో జరిగిన తొక్కిసలాట పై ఏర్పాటు చేసిన రిటైర్డ్ జడ్జి సోమయాజులు కమిషన్ నివేదికపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడింది. అది సోమయాజులు రాసినట్లు లేదని, చంద్రబాబు రాసినట్లు గా ఉందని , ముఖ్యమంత్రి రాస్తే సోమయాజులు సంతకం చేసినట్లుగా ఉందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిది వాసిరెడ్డి పద్మ విమర్శించారు. చంద్రబాబు నాయుడును కాపాడటానికే జస్టిస్‌ సోమాయాజులు నివేదిక ఇచ్చారని ఆమె అన్నారు. చంద్రబాబు ఎవరినైనా మేనేజ్‌ చేయగలరని చెప్పడానికి సోమయాజుల కమిటీ నివేదికే నిదర్శనమన్నారు. తప్పంతా భక్తులదే.. మూడ నమ్మకంతో అంతమంది అక్కడికి వెళ్లటం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పించడం సిగ్గుచేటని ఆగ్రహం వక్తం చేశారు.
పుష్కరాల మరణాలకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. లేని ముహూర్తం పెట్టి.. ప్రచార యావతో 30 మందిని పొట్టనబెట్టుకున్నారని మండిపడ్డారు. కమిషన్‌ రిపోర్ట్‌లో ఉపయోగించిన భాష అభ్యంతరకరంగా ఉందని, ప్రజలకు ఇంగితం లేదని సోమయాజులు ఎలా అంటారని ప్రశ్నించారు. అలాంటి రాతలు రాయటానికి చేతులెలా వచ్చాయని మండిపడ్డారు. తొక్కిసలాట ఫుటేజ్‌ తొక్కేశారని, సోమయాజులు అనే వ్యక్తికి గోదావరి గుణపాఠం తప్పదన్నారు. గోదావరి ఆయనను క్షమించదని, ఆమె హెచ్చరించారు.

tags : ap, godavari, stampede

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info