A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమ్మ…లోకేషా!
Share |
June 20 2019, 9:20 pm

అమ్మ…లోకేషా!
డబ్ల్యుఈఎఫ్ టిక్కెట్లు కొనుగోలు చేసి చైనాకు
పెట్టుబడుల సాధన కోసం అంటూ కలరింగ్ అంటూ వాసిరెడ్డి శ్రీనివాస్ తెలుగు గేట్ వే లో ఇచ్చిన కధనం ఇది..
...............

వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యుఈఎఫ్) న్యూ ఛాంపియన్స్ సమావేశానికి దేశంలో ఆహ్వానం అందుకున్న ఏకైక మంత్రి నారా లోకేష్. ఇదీ కొద్ది రోజుల క్రితం ఏపీలోని అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం హోరెత్తించిన ప్రచారం. నిజంగా ఏపీ మంత్రి నారా లోకేష్ కు నిజంగా ఆహ్వానం అందిందా?. అసలు లోకేష్ లో ఏ క్వాలిటీ చూసి ఏకంగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం న్యూ చాంపియన్స్ సమావేశానికి ఆహ్వానించారు?. అని అరా తీస్తే అసలు విషయం తెలిసిపోయింది. ఈ సమావేశంలో పాల్గొనాలంటే భారీ మొత్తం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దేశంలోని ఏ రాష్ట్రం కూడా అంత భారీ మొత్తం ఫీజు చెల్లించటానికి ఆసక్తి చూపలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎనమిక్ డెవలప్ మెంట్ బోర్డు (ఈడీబీ)కు సీఈవో జాస్తి కృష్ణకిషోర్ ఈ భారీ మొత్తాన్ని ఈడీబీ తరపున చెల్లించి ‘స్లాట్’ బుక్ చేయించారు. అంత మొత్తంలో చెల్లింపులు చేసిన రాష్ట్రం నుంచి ఓ ప్రతినిధి పాల్గొనాల్సి ఉంటుంది. అందుకు ఆహ్వానం కూడా అందుతుంది. దీంతో లోకేష్ ది ఖచ్చితంగా కొనుగోలు చేసిన ఆహ్వానం అని తేలిపోయింది.- Advertisement -
భారీగా డబ్బులు కట్టినందుకు గాను ఏపీ తరపున ఈడీబీ ప్రభుత్వంలో అనధికారికంగా నెంబర్ టూ స్థానంలో ఉన్న నారా లోకేష్ పేరు ఈ సమావేశానికి ప్రతిపాదించింది. అంతే ఆయనకు ఆహ్వానం అందింది. ఇదేదో ఏపీలో లోకేష్ పనితీరును మెచ్చో..లేక ఆయన ఉపన్యాస కళనచ్చో వచ్చిన ఆహ్వానం కాదని తేలిపోయింది. అయితే ఈ ఫీజు నిర్దిష్టంగా ఎంత చెల్లించారనే సమాచారం తెలియలేదు కానీ..ఇది భారీ మొత్తంలోనే ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ద్వారా చెల్లింపులు చేస్తే తెలిసిపోయే అవకాశం ఉండటంతో ఈడీబీ మార్గం ద్వారా వ్యవహారాన్ని నడిపేశారు. ఈడీబీకి బడ్జెట్ లో కేటాయించిన నిధుల్లో నుంచే ఈ చెల్లింపులు చేశారు. దేశంలో ఏ సంపన్న రాష్ట్రం ప్రతినిధి కూడా చైనాలో జరుగుతున్న డబ్ల్యుఈఎఫ్ న్యూ చాంపియన్స్ సమావేశానికి డబ్బులు చెల్లించి హాజరవటానికి ఆసక్తి చూపలేదు.

కట్టుబట్టలతో వచ్చాం..కష్టపడి పనిచేస్తున్నాం అని కబుర్లు చెప్పే ఈ నేతలు మరి ప్రజల సొమ్ముతో ఇలా సమావేశపు టిక్కెట్లు కొనుక్కొని విదేశీ సమావేశాల్లో పాల్గొనాలా?. ఆయనతోపాటు అధికార బృందానికి విలాసవంతమైన విమాన, హోటళ్ళ ఖర్చులు అదనం. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే నారా లోకేష్ కూడా అచ్చం తన తండ్రి బాటలోనే పయనిస్తున్నట్లు కన్పిస్తోంది. టిక్కెట్లు కొనుగోలు చేసి చైనా వెళ్లి పెట్టుబడుల సాధన కోసం అంటూ కలరింగ్ ఇవ్వటం విశేషం. అదీ కూడా కనీసం వెబ్ సైట్ లేని కంపెనీలతో ఎంవోయులు చేసుకుని హంగామా చేయటం. ఇదంతా ఎవరిని మభ్యపెట్టడానికి?.

tags : lokesh, edb

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info