A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
Share |
October 16 2018, 10:37 pm

అద్వాన్నంగా ఉన్న రోడ్డుపై నాట్లు వేసి వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా నిరసన తెలిపారు. రాష్ట్రంలో లక్ష కిలోమీటర్ల రోడ్లు వేశామని మంత్రి లోకేష్ నిత్యం అబద్దాలు చెబుతుంటారని, దానికి నిదర్శనం మేళపట్టు గ్రామంలోని రోడ్డు అని ఆమె అన్నారు. రోడ్డుపై పెద్ద ఎత్తున నిలబడిపోయిన విషయాన్ని ఆమె చూపుతూ అక్కడ నాట్లు వేసి నిరసన తెలిపామని అన్నారు. తమ గ్రామంలో రోడ్లు దారుణంగా తయారయ్యాయని.. నీళ్లు నిలిచి పోయి కాలువలను తలపిస్తున్నాయని మేళపట్టు గ్రామ ప్రజలు చేసిన ఫిర్యాదు మేరకు రోజా ఇలా నిరసన తెలిపారు.గ్రామాలలోకి వచ్చి రోడ్ల పరిస్థితి చూసే ధైర్యం టీడీపీ నేతలకు లేదని మండిపడ్డారు. జిల్లా పరిషత్ సమావేశంలో అనేకసార్లు రోడ్ల దుస్టితి గురించి మాట్లాడినా పట్టించుకోలేదన్నారు.

tags : roja, roads

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info