గోదావరి పుష్కరాలపై నివేదిక వచ్చింది. రిటైర్డ్ న్యాయమూర్తి సోమయాజులు కమిషన్ ప్రభుత్వాన్ని తప్పు పట్టకుండా మీడియాని తప్పు పట్టి చేతులు దులుపుకోవడం విశేషమే కాని, పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఏ కమిషన్ నివేదిక కూడా ఇంతకన్నా భిన్నంగా వస్తుందని ఎవరూ ఊహించలేదు.మూడ నమ్మకాలపై పెద్ద ఎత్తున మీడియా ప్రచారం చేసిందని, మొదటి రోజు స్నానం చేయడం పుణ్యమన్నట్లుగా ప్రచారం జరిగిందని, పుష్కరాల ప్రతి రోజూ పుణ్యమేనని మీడియా ప్రచారం చేసిందని ,పత్రికలు,చానళ్లు గుడ్డి నమ్మకాన్ని ప్రచారం చేశాయని నివేదికలో తెలిపారు.అసలు ఆ ప్రచారానికి కారణం ఎపి ప్రభుత్వం అన్న సంగతిని కమిషన్ నివేదిక విస్మరించిందన్న విమర్శ వస్తోంది.పైగా ఇదంతా చంద్రబాబుపై పెట్టడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించాయని నివేదిక వ్యాఖ్యానించడం చిత్రంగానే ఉంటుంది.షూటింగ్ , చంద్రబాబు నాయుడు పుష్కర ఘాట్ లో స్నానం చేయడం వంటి కారణాలను కమిషన్ నివేదిక పట్టించుకోకపోవడం గమనార్హం. tags : ap, pushkaralu