A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
Share |
December 10 2018, 10:29 am

మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృతను ఏకగ్రీవంగా చట్టసభకు పంపించాలని సిపిఎం కార్యదర్శి తమ్మినేనీ వీరభద్రం సూచించారు.ఆ ప్రతిపాదనకు టి.మాస్ చైర్మన్ కంచె ఐలయ్య కూడా మద్దతు ఇచ్చారు.వారు మిర్యాలగూడలో ప్రణయ్ నివాసానికి వెళ్లి అమృతకు సంఘీభావం తెలిపారు. కుల దురహంకారానికి ప్రణయ్‌ బలయ్యాడని, ఈ హత్యకు బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అమృతను చట్టసభలకు పంపాలన్నారు. సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ తరఫున మిర్యాలగూడ శాసనసభ నుంచి ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవ తీసుకోవాలన్నారు.మంత్రులు ఎవరూ వచ్చి ఎందుకు పరామర్శ చేయలేదని వారు ప్రశ్నించారు. అమృతను ఈ పరిస్థితిలో రాజకీయాలలోకి తీసుకు రావడం కరెక్టేనా?

tags : amruta, mla

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info