ఉద్యమ పార్టీ అని నమ్మి ఓటేసిని ప్రజల నమ్మకాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ వమ్ము చేశారని బిజెపి అద్యక్షుడు లక్ష్మణ్ అన్నారు.కారణం లేకుండా తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేశారని విమర్శించారు. ఇంటింటికి నీళ్లు ఇవ్వకుండా ఓటు అడగనన్న కేసీఆర్.. ఇప్పుడు ప్రజలను ఓట్లు ఎలా అడగతారంటూ ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు శాంపిల్స్‌గా మాత్రమే కట్టారని, రెండు లక్షల ఇళ్లు ఎక్కడా కట్ట లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవనితీ జరిగిందని విచారణ చేయిస్తానని చెప్పిన కేసీఆర్ ఎందుకు వెనక్కి తగ్గారన్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్లు లోపాయకారి ఒప్పందం చేసుకుందని, ప్రజల మందు డూప్ ఫైట్ చేస్తున్నారని లక్ష్మణ్ ద్వజమెత్తారు. tags : lakshman, kcr, votes