A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
Share |
December 12 2018, 9:19 am

టిఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ జనసమితి అదినేత కోదండరామ్ విరుచుకుపడ్డారు. తెలంగాణలో గడీల పాలన సాగుతోందని ఆయన ద్వజమెత్తారు.
నిరంకుశ, గడీల పాలనను అంతమొందించేందుకు అంతా ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెరాస సర్కారు వచ్చాక రాష్ట్రంలో మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛతో పాటు అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని మండిపడ్డారు. ప్రస్తుతం ఫ్యూడల్‌ పాలన సాగుతోందని, దీన్ని అంతమొందించేందుకు అంతా ఏకతాటిపైకి వచ్చి ధర్నాచౌక్‌ను సాధించుకున్నట్టుగానే ప్రజాస్వామ్య తెలంగాణను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ధర్నా చౌక్‌ను ఎత్తివేయడంపై ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు రాసిన లేఖపై హైకోర్టు న్యాయమూర్తి స్పందించి కేసును విచారణ చేపట్టడంతో పాటు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కేసీఆర్‌ పాలన పతనానికి ప్రారంభం అన్నారు. అప్రజాస్వామిక పద్ధతిలో ధర్నాచౌక్‌ను రద్దుచేశారని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సంతోషంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి అన్నారు.

tags : kodandaram, gadi,rule,kcr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info