A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
Share |
December 10 2018, 9:29 am

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి కావడంతో పాటు ప్రభుత్వం ప్రటించిన వివిధ కార్యక్రమాలతో రింగ్ రోడ్డూ చుట్టూరా గృహ నిర్మాణ అనుమతులు 200 శాతం పెరిగాయని కదనం.ఏప్రిల్ లో ఔటర్ రింగ్ రోడ్డులో అసంపూర్తిగా ఉన్న కండ్లకోయ భాగం కోర్టు క్లియరెన్స్ తర్వాత పూర్తి అయింది.దానికి తోడు రింగ్ రోడ్డు చుట్టూరా రేడియల్ రోడ్లు వేసి నగరానికి, తెలంగాణ జిల్లాలకు కనెక్టివిటి పెంచుతామని ప్రభుత్వం ప్రకటించింది.అదే సమయంలో మిషన్ భగీరద ద్వారా నగర శివారు ప్రాంతాలకు, గ్రామాలకు తాగు నీరు ఇస్తామని, మౌలిక సదుపాయలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం కూడా కలిసి వచ్చింది.దాంతో రియల్ ఎస్టేట్ బాగా పుంజుకుంది.గత ఏడాది లే అవుట్ పర్మిషన్లు, గేటెడ్ కమ్యూనిటి పర్మిషన్లు వంటివి 1036 మంజూరు చేయగా, ఈ ఏడాది ఇప్పటికే 1900 అనుమతులు ఇచ్చామని హెచ్ ఎమ్. డి.ఎ. అదికారులు చెబుతున్నారు.దీనిని బట్టే ఎంత గా గృహనిర్మాణం పుంజుకుందీ అర్దం అవుతుందని అంటున్నారు.

tags : hyderabad, outer ring road

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info