A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విజయ్ మాల్యాకు,జైట్లికి డీల్-రాహుల్ ఆరోపణ
Share |
December 10 2018, 10:58 am

ప్రధాని మోడీ చౌకీదారుగా ఉంటానని అన్నారని , ఆయన ఒక ఆసక్తికరమైన చౌకీదార్ అని ,రాత్రిపూట తలుపులు తీసి వెళ్లిపోయే కాపలాదారు అని రాహుల్ ఎద్దేవ చేశారు.విజయ్ మాల్య 9 వేల కోట్లు బ్యాంకు రుణాలు ఎగవేశాడని, అతను లండన్ పారిపోయే ముందు ఆర్దిక మంత్రిని కలిశాడని ఆయన అన్నారు.తనను విజయ్ మాల్యా కలిసి లండన్ వెళ్తున్నానని చెప్పాడని జైట్లి తెలిపారని, అయినా ఆయన సిబిఐకి మాత్రం తెలియచేయలేదని ఆయన అన్నారు. దేశం అంతటికి విజయ్ మాల్యా దొంగ అని తెలుసునని , పోలీస్ కానిస్టేబుల్ దొంగను పట్టుకోవాలని, కాని అతను వదలివేస్తే అతనిపై పై అదికారి చర్య తీసుకోరా?అని ఆయన అన్నారు.కాని దేశ ఆర్దిక మంత్రి కే విజయమాల్యా చెబితే పట్టించుకోలేదని ,మరి ఈయనపై చర్య తీసుకోవాలా?వద్దా అని ఆయన ప్రశ్నించారు.ఆర్దిక మంత్రికి డీల్ ఉంటే నే విజయ్ మాల్యాను వదలివేశారని రాహుల్ ఆరోపించారు.ఈ మద్యలో కాపలాదారు వదలివేశారని ఆయన అన్నారు. ఆర్దిక మంత్రిని తొలిగించి ఉండాలని,మోడీయే అవినీతి పరుడు కావడమే కారణమని అన్నారు. రాఫెల్ డీల్ దీనికి ఉదాహరణ అని ఆయన అన్నారు.

tags : rahul, jaitley, vijay malya

Latest News
*అమరావతిలో ప్రభుత్వ రియల్ ఎస్టేట్ బిజినెస్
*తెలంగాణకే కాదు..ఆంద్ర ప్రజలకు పరీక్షే- విశ్లేషణ
*ఉండవల్లికి కళ్లు తిరుగుతున్నాయి
*ఎపిలో ఎన్నికల ముందు మరో కొత్త స్కీమ్
*పార్టీ మారను-అదంతా కేంద్రం కుట్ర అట
*చంద్రబాబు-కట్టప్ప-బిజెపి
*క్షమాపణ కోరిన మాజీ ముఖ్యమంత్రి కుటుంబం
*తెలంగాణలో గబ్బిలాలను వాడిన నేతలు
*ఒడిషా లో కాంగ్రెస్ కోసం టిడిపి ప్లాన్ బి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info