విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదా వంటివి అమలు చేయకుండా ప్రదాని నరేంద్ర మోడీ ఎపి ప్రజలను అగౌరవపరిచారని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాందీ అన్నారు. నాటి ప్రదాని మన్మోహన్ సింగ్ అన్ని చర్చించి, విబజనసమయంలో ఎపికి న్యాయం చేయడానికి ప్రతిపాదనలు చేస్తే, మోడీ వాటిని పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ప్రదాని మోడీ ప్రతి ఒక్కరికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తానన్నారని ,కాని ఇచ్చారా అని రాహుల్ ప్రశ్నించారు.తాను అమలు కాని వాగ్దానాలు చేయబోనని రాహుల్ అన్నారు.కాంగ్రెస్ అదికారంలోకి రాగానే ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని ఆయన అన్నారు.ఇది డబ్బు కు సంబందించిన విషయం కాదని, బహుమతి కాదని ఆయన అన్నారు.ఇది ఎపి ప్రజలకు ఇచ్చిన హామీ అని ఆయన అన్నారు.
ఒక ప్రధాని ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ఉండరాదని ఆయన అన్నారు. tags : rahul gandhi, modi;