A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మా ప్రభుత్వమే వస్తుంది జాగ్రత్త- ఉత్తం వార్నింగ్
Share |
September 23 2018, 8:44 am

పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి మరోసారి పోలీసులపై విరుచుకుపడ్డారు. కొందరు పోలీసు ఉన్నతాధికారులు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహరిస్తూ కాంగ్రెస్‌ నేతలను ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.మూణ్నెల్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీనే అధికారంలో ఉంటుందన్న విషయాన్ని సదరు అధికారులు మర్చిపోవద్దన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ అధికారినీ వదిలిపెట్టేది లేదని, అలాంటి అధికారుల జాబితా సిద్ధం చేస్తున్నామని హెచ్చరించారు.

tags : uttam,police officers

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info