A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ లో సినీ ప్రముఖుడు
Share |
September 23 2018, 7:37 am

సినీ ప్రముఖుడు బండ్ల గణేష్ కాంగ్రెస్ లో చేరారు. ఎఐసిసి అదినేత రాహుల్ గాందీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.కాంగ్రెస్ లో చేరాలన్నది తన కల అని ,అది నెరవేరిందని అన్నారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తారా అని అడిగితే పార్టీ కోరితే తప్పక చేస్తానని అన్నారు. వద్దంటే పోటీచేయనని అన్నారు. అయితే తాను ఎన్నికలలో గెలిచి ఎమ్మెల్యే గా ప్రమాణం చేస్తానన్న నమ్మకం ఉందని ఆయన చెప్పారు.
పార్టీలో చేరడానికి నాకు అవకాశం ఇచ్చిన రాహుల్ గాంధీ, ఉత్తమ్‌, కుంతియాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. తాను టిఆర్ఎస్ టిక్కెట్ కోరలేదని అన్నారు. జనసేన అదినేత పవన్ కళ్యాణ్ తనకు తండ్రి వంటి వారని ఆయన అన్నారు.

tags : ganesh, congress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info