A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు 22 సార్లు కోర్టుకు గైర్ హాజరయ్యారు
Share |
January 22 2019, 3:48 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు నోటీస్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఒక ముద్దాయి కోర్టుకు హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారంట్ వస్తుందని , ఆ సంగతి తెలుగుదేశం నేతలకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. కోర్టులను అవమానించే రీతిలో టిడిపి నేతలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తెలుగుదేవం పార్టీ నేతలు దీనిపై బిజెపిపై ఆరోపణలు చేయడం ఏమిటని ఆయన అన్నారు. వాయిదాలకు వెళ్లకపోతే వారంట్లు రావా అని అన్నారు. కాగా మరో నేత పురందేశ్వరి మాట్లాడుతూ 2010 నాటి కేసుకు బిజెపికి ఏమి సంబందం అని ప్రశ్నించారు. ఏదైనా ఉంటే మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుకోవాలని ఆమె అన్నారు. దీని వెనుక మోడీ ఉన్నారనేది అవాస్తవం అని ఆయన అన్నారు. చంద్రబాబు ఇరవై రెండు సార్లు కోర్టుకు వెళ్లలేదని, ఎప్పటి నుంచో వాయిదాలు నడుస్తున్నా చంద్రబాబు హాజరు కాలేదని , అందువల్లే నోటీసులు వచ్చాయని ఆయన అన్నారు.

tags : kanna, chandrabau, notices

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info