A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి నేతల హడావుడి
Share |
November 18 2018, 4:39 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు పదమూడు మంది టిడిపి నేతలకు మహారాష్ట్ర లోని దర్మాబాద్ కోర్టు నోటీసు ఇవ్వడంపై టిడిపి నేతలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఖండనల మీద ఖండనలు ఇస్తున్నారు.ఇదంతా బిజెపి కుట్ర అని వారు ఆరోపిస్తున్నారు.తాము తెలంగాణ ప్రయోజనాల కోసం బాబ్లి ప్రాజెక్టు వద్దకు వెళ్లామని వారు అన్నారు. టిడిపి మాజీ ఎమ్.పి నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ తాము అప్పుడు నరకం చూశామని అన్నారు.తాము త్యాగాలకు సిద్దం అవుతామని ఆయన అన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత తమకు నోటీసులు ఇవ్వడం ఏమిటని ఆయన అన్నారు. దీనిపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని ,మహరాష్ట్రలో గవర్నర్ గా ఉన్నది తెలంగాణ నేత విద్యాసాగరరావు అని, ఆయన కూడా స్పందించాలని మరో నేత రావుల చంద్రశేఖరరెడ్డి అన్నారు. తాము దీనిని ప్రజలలోకి తీసుకు వెళతామని మరో నేత పెద్దిరెడ్డి అన్నారు. కాగా ఇది బిజెపి కుట్ర అని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు.ఒక ముఖ్యమంత్రిని ఈ రకంగా అవమానిస్తారా అని ఆయన ప్రశ్నించారు.

tags : tdp, babli

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info