A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చల్లబడ్డ ఓదేలు
Share |
September 23 2018, 8:20 am

చెన్నూరు నియోజకవర్గ టిక్కెట్ తనకు రాలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, స్వీయ నిర్భందం తో సహా పలు ఆందోళనలకు దిగిన మాజీ ఎమ్మెల్యే ఓదేలు శాంతించారు. పెద్దపల్లి ఎమ్.పి బల్క సుమన్ కు ఈ టెక్కెట్ ను టిఆర్ఎస్ నాయకత్వం ఇచ్చిన సంగతి తెలిసిందే.ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయనను పిలిపించి మాట్లాడిన తర్వాత ఓదేలు చల్లబడ్డారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు ఓదేలు తెలిపారు. కేసీఆర్‌ మాటే తనకు శిరోధార్యమని.. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ అభ్యర్థి గెలిస్తేనే కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని ఓదేలు అన్నారు.

tags : trs, odelu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info