A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దేశభక్తి ర్యాలీ తీస్తే కేసు పెడతారా
Share |
November 16 2018, 12:49 am

ఎవరికి నోటీసులు వస్తే వారు తమపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.తెలంగాణ ప్రభుత్వంపై బిజెపి మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా ఈ ఆరోపణ చేశారు.ఆగస్టు పదిహేనును అనుమతి లేకుండా ర్యాలీ తీశారన్న అబియోగంపై తనపై అక్రమ కేసు పెడుతున్నారని ఆయన అంటున్నారు. దేశభక్తిని చాటేందుకు తిరంగా యాత్ర నిర్వహిస్తే ఇలాంటి కేసులు పెట్టడం దారుణమని ఆయన అన్నారు. ఈ కేసుకు సంబంధించి తమ ఎదుట హాజరు కావాల్సిందిగా అబిడ్స్ పోలీసులు తనకు నోటీసులు జారీ చేశారని, కేవలం మజ్లీస్ పార్టీ ఒత్తిడి మేరకే తనపై ర్రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని రాజాసింగ్ పేర్కొన్నారు. అయితే ఇలాంటి కేసులకు తాను భయపడబోనని ఆయన అన్నారు.కోర్టులోనే ఈ విషయం తేల్చుకుంటానని ఆయన స్పష్టం చేశారు.

tags : rajasing, rally, case

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info