A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గతంలో బిజెపిని బాబు ఏమన్నాడో గుర్తుందా..జగన్
Share |
November 15 2018, 11:58 pm

చంద్రబాబు ప్రతి అడుగులోనూ మోసమేనని, ముస్లిం మైనారిటీలను మనుషులుగా చూడకుండా ఓటు బ్యాంకుగా చూశారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రణాళిక మొదలు నంద్యాల ఉపఎన్నికల వరకు ఇచ్చిన ప్రతి హామీ మోసమేనన్నారు .విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలోని చినగదిలిలో జరిగిన ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. 2002లో ఇదే బీజేపీని తిట్టాడు. 2004లో అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. 2004 ఎన్నికల్లో ఓడిపోయాక.. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చరిత్రాత్మక తప్పిదమంటాడు. 2012లో అయితే ఏకంగా హైదరాబాద్‌లో ముస్లిం సోదరుల మీటింగ్‌ పెట్టి ముస్లిం డిక్లరేషన్‌ అని పేరు పెట్టి బీజేపీతో పొత్తు చరిత్రాత్మక తప్పిదమన్నాడు. రెండేళ్లు తిరగకముందే 2014లో ఇదే వ్యక్తి మోదీ గారి గాలి విపరీతంగా వీస్తుందని చెప్పి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. నాలుగన్నర సంవత్సరాల పాటు చిలకా గోరింకలా సంసారం చేశారు. ఒకరికొకరు పొగుడుకున్నారు. 2017 జనవరి 27న కేంద్ర ప్రభుత్వం దేశంలోనే ఏ రాష్ట్రానికి చేయని మేలు మన రాష్ట్రానికి చేసిందని ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో గొప్పగా చెప్పకున్నాడు. ఇప్పుడు బీజేపీతో విడాకులు తీసుకున్న తర్వాత.. బాబుపై ఉన్న వ్యతిరేకతనంతా ఎవరిపైనో ఒకరిపైకి నెట్టేయాలని చూసి మళ్లీ మోదీపైనే వేస్తాడు. వాళ్లు సహకరించలేదు కనుక తను చేయలేకపోయానని డ్రామా మొదలు పెట్టాడు. అని ఆయన ద్వజమెత్తారు.

tags : jagan, bjo,muslims

Latest News
*ఎన్.టి.ఆర్., హరికృష్ణ ఆత్మలు సంతోషిస్తాయా?లేక
*కాంగ్రెస్ టిక్కెట్ల అమ్మకం ఆడియో టేప్ కలకలం
*చంద్రబాబు మాదిరి నేను కంప్యూటర్ కనిపెట్టలేదు
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*శబరిమలైలోకి ప్రత్యేక రోజుల్లో స్త్రీలకు అనుమతి
*ఇద్దరు మాజీ ఎమ్మెల్యే లు కాంగ్రెస్ కు గుడ్ బై
*టిడిపి దరిద్రం మాకు అంటిస్తారా- కార్తీక్ వర్గం
*చంద్రబాబు లాగానే పవన్ మాట్లాడుతున్నారు
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info