A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి-కాంగ్రెస్ పొత్తు-విజయసాయి వ్యాఖ్య
Share |
September 23 2018, 7:38 am

తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ–కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడం కేవలం అవకాశవాదమే కాదు, అపవిత్రం కూడా అని ఎంపీ వి.విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘టీడీపీ–కాంగ్రెస్‌ పొత్తు అవకాశవాదమే కాదు, అది అపవిత్రమైనది కూడా. ఆ రెండు పార్టీలనూ ఏ సిద్ధాంతాల ప్రాతిపదికగా స్థాపించారో వాటిని సమాధి చేసి కేవలం అధికారంపై దురాశతోనే ఈ అవకాశవాద పొత్తుకు పూనుకున్నారు. సోనియాగాంధీ జాతీయత పేరుతో విదేశీయురాలు అని చంద్రబాబు తీవ్రమైన విమర్శలు చేసి ఇంకా రెండేళ్లయినా కాలేదు. అంతెందుకు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే తాను ఉరేసుకుంటానని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఇటీవలే ప్రకటించారు. ఈ అవకాశవాద పొత్తును చూస్తే అధికారం కావాలనే స్వార్థం తప్ప నైతికతలు వారికి పట్టవు అనిపిస్తోంది. "అని ఆయన ట్విటర్ లో వ్యాఖ్యానించారు.

tags : vijayasai, tdp, congress, alliance

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info