A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇక శారిడాన్ వాడడానికి లేదు
Share |
September 23 2018, 7:52 am

చాలాకాలం పాటు తలనొప్పి వస్తే శారిడాన్ వేసుకుందాం అన్నది జన నానుడిగా ఉండేది.ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ మందును నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.దానితో పాటు 328 రకాల ఎఫ్‌డీసీ డ్రగ్స్‌ను వెంటనే తయారు చేయడం, విక్రయించడం ఆపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. వివిధ కంపెనీలు దాదాపు 6000 బ్రాండ్లతో ఈ ఔషధాలను అమ్ముతున్నారు. ప్రభుత్వ చర్యతో ఈ బ్రాండ్ల అమ్మకాలన్నీ ఆగిపోనున్నాయి. రూ.2000 కోట్ల నుంచి రూ.2500 కోట్ల వరకు వీటి మార్కెట్‌ సైజు ఉంటుంది.
ఇవి వాడటం వల్ల ప్రజల ఆరోగ్యానికి మరింత నష్టం వాటిల్లుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, ఎఫ్‌డీసీల తయారీని, విక్రయాలను, పంపిణీని నిరోధించడం అవసరం అని డ్రగ్స్ సాంకేతిక బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది.

tags : saridon, ban

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info