A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాబ్లి కేసు- చంద్రబాబుకు నోటీస్ వస్తుందా!
Share |
April 19 2019, 8:40 pm

ఎనిమిదేళ్ల క్రితం పెండింగులో ఉన్న ఒక కేసులో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహారాష్ట్రలోని ఒక కోర్టుకు హాజరు కావల్సి ఉంటుందని వచ్చిన వార్త ఆసక్తికరంగా ఉంది. బాబ్లి ప్రాజెక్టు పేరుతో చంద్రబాబు నాయుడు అప్పట్లో టిడిపి ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్రలోకి వెళ్లారు. ఆనాటి ప్రభుత్వం వారిని అక్కడకు అనుమతించలేదు. అయితే వీరంతా ఎక్కడ ఉంటే అక్కడే అరెస్టు అని ప్రకటించి, ఆ తర్వాత ఆనాటి ఎపి ముఖ్యమంత్రి రోశయ్య సూచన మేరకు వారిని ప్రత్యేక విమానంలో ఎపికి పంపించింది. అప్పుడు వచ్చిన నిజామాబాద్ ఉప ఎన్నికలో ప్రచారానికి వెళ్లకుండా తప్పించుకోవడం కోసం చంద్రబాబు బాబ్లి ప్రాజెక్టు హడావుడి చేశారని అంటారు. ఆ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్ధి లక్ష్మీనారాయణ గెలిచారు.చంద్రబాబు బాబ్లి ప్రాజెక్టు పేరుతో హడావుడి చేసినా టిడిపికి డిపాజిట్ రాలేదు.ఇప్పుడు ఆ కేసు నమోదు అయిన దర్మాబాద్ కోర్టు చంద్రబాబు కు నోటీసులు ఇవ్వవచ్చని ఒక హిందీ పత్రిక కదనం ఇచ్చింది. దానిపై మంత్రి లోకేష్ మాట్లాడుతూ నోటీసు వస్తే చంద్రబాబు కోర్టుకు హాజరవుతారని అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం అప్పుడు బాబ్లికి వెళ్లారని ఆయన అన్నారు.అయితే అసలు విషయం ఏమిటంటే తెలంగాణ ఉద్యమం లో తెలుగుదేశం బాగా దెబ్బతింది. ఆ సమయంలో వచ్చిన ఉప ఎన్నికలో ఏమైనా లాభం జరుగుతందా అని బాబ్లి సీన్ సృష్టించారు. విశేషం ఏమిటంటే బాబ్లి ప్రాజెక్టు అంతా కలిపి రెండు టి.ఎమ్.సిలు కూడా ఉండదని చెబుతారు.

tags : chandrababu, babli case

Latest News
*ఈసి తో చంద్రబాబు మరో వివాదం
*కాంగ్రెస్ కు ప్రియాంక చతుర్వేది రాజీనామా
*కోడెల కుమారుడుపై శాటిలైట్ పైరసీ కేసు
*మోడీ పేరు ఉంటే దొంగేనా-ఏమిటో రాహుల్ ఇలా..
*ప్రజలు గుర్తు చేసుకుని మరీ ఓట్లు వేశారు
*యోగి గుడులకు ఎలా వెళతారు
*బ్యాంకు ఖాతాల వివరాలు ఉంటే కేసే
*చినరాజప్ప కూడా ఇలా మాట్లాడుతున్నారు
*టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ విలీనం..వేగం అయిందట
*చంద్రబాబు సమీక్షలపై నివేదికలు అడిగాం-సిఇఓ
*ఎమ్మెల్యే సండ్రకు భారీ గిట్టుబాటు
*కెసిఆర్,జగన్ ,పట్నాయక్ లు కింగ్ మేకర్లు!
*రజనీకాంత్ మళ్లీ లింక్ పెట్టారా
*రాహుల్ కు అండగా ఉంటా
*ఎన్నికల అధికారి అదీశ్యం
*ఏనుగు తొక్కింది-5 గురు మరణించారు
*అప్పుడు పుల్లారావు గుడ్డిపత్తి అమ్ముకునేవారు
*ఎబి వెంకటేశ్వరరావుకు విజయసాయి ప్రశ్న
*కాంగ్రెస్ లో ప్రియాంక చతుర్వేది కలకలం
*ముసద్దిలాల్ 82 కోట్ల భంగారం జప్తు
*1400 కిలోల బంగారంపై నోరు మెదపరే
*సుజనా డైరెక్టర్లకు ఇబ్బంది తప్పదా
*పవన్ కళ్యాణ్ కూడా డబ్బులు పంచారు
*సర్వేలన్ని టిడిపికి అనుకూలమట-బాబు ఉవాచ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info