A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నేను విఫలం అయితే..ప్రజలు ఓడినట్లు-బాబు
Share |
September 23 2018, 8:44 am

మొత్తం మీద ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఓటమి భయం వెన్నాడుతున్నట్లుగా ఉంది. అందుకే ఈ డైలాగ్ వచ్చినట్లు కనిపిస్తుంది. ఈనాడులో వచ్చిన ఒక కధనం ప్రకారం చంద్రబాబు డైలాగులు అలా ఉన్నాయి.తాను విఫలం అయితే అది ప్రతిపక్ష విజయం కాదట..ఐదు కోట్ల మంది ప్రజల ఓటమి అని ఆయన కొత్త సూత్రీకరణ చేశారు. తనకు జీవితంలో ఓటమేలేదని కూడా ఆయన ప్రకటించారు.ప్రతిపక్ష నేతకు అవగాహన లేదని కూడా ఆయన చెప్పేశారు.తన వల్లే పోలవరం పూర్తి అవుతుందని ఆయన అంటున్నారు. కేంద్రం ఇస్తున్న డబ్బంతటిని తన ప్రచార ఖాతాలోకి వేసుకుని మరీ చంద్రబాబు చెప్పగలగడం విశేషం.చంద్రబాబు ఇప్పటికి రెండుసార్లు ఓటమి చవిచూశారు..అంటే అప్పుడు ఉమ్మడి ఎపిలోని ప్రజలంతా ఓడిపోయినట్లు అనుకోవాలన్నమాట.

tags : chnadrababu, failure

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info