A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సుమన్ చరిత్రను బయటపెడతా
Share |
November 16 2018, 12:20 am

పెద్దపల్లి ఎమ్.పి బల్క సుమన్ చరిత్రను ముఖ్యమంత్రి కెసిఆర్ ఎదుట బయటపెడతానని టిక్కెట్ పొందలేకపోయిన టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఓదేలు హెచ్చరించారు. తమ వర్గం వారు సుమన్ పై దాడి చేయలేదని ఆయన అన్నారు. తన కు టిక్కెట్ ఇవ్లలేదని కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేసిన గట్టయ్యను ఆయన వరంగల్ ఆస్పత్రిలో పరామర్శించారు.
ఆత్మహత్యాయత్నం చేసుకున్న వారిపై హత్యాయత్నం కేసు పెట్టించడం దారుణమన్నారు.
స్థానికేతరుడికి టికెట్‌ కేటాయించడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. దాడి చేయించాల్సిన అవసరం తనకు లేదని ఆయన చెప్పారు. తాను ప్రజల మధ్య ఉండి రాజకీయం చేస్తానే తప్ప ఇలాంటి దిగజారుడు పనులకు పాల్పడనని చెప్పారు. బాల్క సుమన్‌ గురించి ఓయూ విద్యార్థులకు తెలుసునని విమర్శించారు.

tags : odelu, sunman

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info