A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అదికారం రాకపోతే సన్యాసమే- కెటిఆర్
Share |
September 23 2018, 8:47 am

తెలంగాణలో మరోసారి తాము అదికారంలోకి రావడం ఖాయమని, ఒక వేళ అదికారంలోకి రాలేకపోతే తాను రాజకీయాల నుంచే వైదొలగుతానని మంత్రి కెటిఆర్ అన్నారు.అసెంబ్లీ ఎన్నికలలో బ్రహ్మాండమైన విజయం రాబోతోందని ఆయన అన్నారు.అతి నమ్మకం, అహంకారంతో తాను ఈ మాట అనడం లేదని, ప్రజలపై ఉన్న అచంచల విశ్వాసంతోనే చెబుతున్నానని అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించకపోతే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆరే ఈ ఎన్నికలకు కర్త, కర్మ, క్రియ అని అన్నారు. విపక్షాలు భయంతో, భీతితో ఎన్నికలకు ముందే అస్త్రసన్యాసం చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. శరవేగంగా సాగుతున్న తెలంగాణ ప్రగతికి ఆటంకాలు కల్పిస్తు, చిన్నాభిన్నం చేసేందుకు కుట్ర చేస్తున్న విపక్షాలు చెల్లాచెదురు అయ్యేలా తెలంగాణ ప్రజలు గొప్ప తీర్పు ఇవ్వనున్నారని కెటిఆర్ జోస్యం చెప్పారు.

tags : ktr, power

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info