A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పొత్తు ఎఫెక్ట్- కాంగ్రస్ కు గుడ్ బై
Share |
April 25 2019, 1:30 am

తెలంగాణలో కాంగ్రెస్,తెలుగుదేశం పార్టీల పొత్తు ప్రభావం కొందరిపై పడుతోంది.తమకు టిక్కెట్ రాకుండా పోతుందన్న భయంతో ఉన్న కొందరు నేతలు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు.ఉప్పల్ నియోజకవర్గాన్ని టిడిపికి కేటాయించవచ్చని సమాచారం రావడంతో ఆ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జీ బండారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పడానికి సిద్దమవుతున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన బండారి లక్ష్మారెడ్డి.. ప్రస్తుతం కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ఎంతో ఆశతో వేచి చూసినా.. దాదాపు నిరాశే æఎదురవుతుందన్న సమాచారం మేరకు ఎట్టకేలకు పార్టీని వీడటానికి సిద్ధమయ్యారు.టిఆర్ఎస్ లో చేరాలని వీరు భావిస్తున్నారు. కార్యకర్తలు, ముఖ్య నాయకులతో సుదీర్ఘ మంతనాలు చేసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పతనం చేయడానికి స్థాపించిన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం దారుణమని బండారు లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉంటూ, పార్టీ కోసం పని చేసిన తన కు ఉప్పల్‌ టికెట్‌ ఇవ్వకపోవడం దారుణమన్నా రు. తనతోపాటు నియోజకవర్గంలో పలువురు నేతలు పార్టీ మారుతున్నట్లు పేర్కొన్నారు.

tags : congress, resignation

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info