A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో ఐటి పేరుతో భూముల స్కామ్ పై పిల్
Share |
November 16 2018, 2:05 am

ఎపి ప్రభుత్వం తప్పుడు అంకెలు చూపుతూ ఇరవైఐదు వేల కోట్ల రూపాయల మేర క్విడ్ ప్రోకో జరిగిందని ఆరోపిస్తూ ఒక మాజీ న్యాయాదికారి శ్రావణ్ కుమార్ హైకోర్టులో పిల్ వేశారు. అనేక కంపెనీలు వచ్చేశాయని, ఉద్యోగాలు వచ్చాయని ప్రచారం చేస్తూ వెబ్ సైట్ లలో తప్పుడు వివరాలు పెట్టడమే కాకుండా,ఆయా డొల్ల కంపెనీలకు అనేక రాయితీలు,భూములు ఇచ్చి పెద్ద ఎత్తున మోసానికి పాల్పడ్డారని ఆయన అన్నారు.ఒక కంపెనీకి,మరో కంపెనీకి ఇచ్చిన జిఓలు పేరెంటల్ జిఓతో సంబందం లేకుండా పోయిందని ఆయన చెప్పారు. కాని ఎపి ప్రభుత్వం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, మాజీ మంత్రి పల్లె రఘునాదరెడ్డి, ఎన్.ఆర్టి నాయకత్వం వహిస్తున్న వేమూరి రవికుమార్ లు ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఆయన అన్నారు. 500 కోట్ల రూపాయల విలువైన భూములను అతి తక్కువ ధరకు ఇచ్చారని ఆయన తెలిపారు. ఎన్.ఆర్.టి ద్వారా వచ్చిన కంపెనీలను ప్రభుత్వ అదికారులు ఎవరూ వెళ్లకుండా ఆదేశాలు ఇచ్చారని ,అది ఎలా చెల్లుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ స్కామ్ కు సంబందించిన నలభై ఐదు జిఓలను కూడా తన పిల్ లో జత చేశానని శ్రావణ కుమార్ చెప్పారు.దీనిపై సిబిఐ విచారణ జరపాలని తాను హైకోర్టు ను కోరానని అన్నారు. భూములు ఎవరెవరికి ఇచ్చారు?వాటిలో క్విడ్ ప్రోకో ఏమిటి?తదితర వివరాలపై విచారణ జరగాలని ఆయన అన్నారు.లక్షల ఉద్యోగాలు వచ్చాయని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని కూడా ఆయన అన్నారు.

tags : high court, pil

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info