A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మాజీ ఉప ముఖ్యమంత్రికి రాసలీలల చికాకు
Share |
November 16 2018, 2:56 am

తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్యకు వ్యతిరేకంగా కొందరు అసమ్మతి జెండా ఎగురవేయడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. పైగా ఆయన రాసలీలల వీడియో అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మరింత చికాకుగా మారినట్లు కనిపిస్తుంది. టిఆర్ఎస్ నాయకుడు సూదుల రత్నాకర్‌ రెడ్డి, జడ్పీటీసీ భూక్య స్వామినాయక్‌, రఘునాథపల్లి ఎంపీపీ దాసరి అనిత తదితరులు మాట్లాడుతూ
నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు పాల్పడడంతో తాము నిస్సందేహంగా ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించామని, ప్రస్తుతం సోషల్‌ మీడియాతో పాటు వివిధ రకాల టీవీ చానళ్లలో ప్రసారమవుతున్న సంభాషణల కథనాల ఆధారంగా నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజల్లో చులకన భావం ఏర్పడే ప్రమాదం పొంచి ఉందన్నారు. సాక్షాత్తు ఒక శాసనసభ్యుడిగా, మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన తాటికొండ రాజయ్య తన స్థాయిని మరచి, ఒక మహిళతో చిల్లర మల్లరగా దిగజారుడు, అసభ్య ఫోన్‌ సంభాషణలు చేయడం హేయమైన చర్యగా వారు అన్నారు. ఆయనకు టిక్కెట్ ఇవ్వరాదని వారు కోరారు. అయితే రాజయ్య వీటిని ఖండిస్తున్నారు. తాను ఎవరితో, ఎలాంటి ఫోన్‌ సంభాషణలు చేయలేదని, తనకు మహిళలంటే అపారమైన గౌరవమని, ఎన్నికల సందర్భంలో తనంటే గిట్టనివారే ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌కు పాల్పడుతున్నారని, నిజానిజాలు త్వరలోనే వెలుగు చూస్తాయని ఆయన చెబుతున్నారు.

tags : telangana, dy cm

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info