A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైకోర్టు విభజన కు తొందరేంటన్న బాబు
Share |
November 16 2018, 2:57 am

తెలుగుదేశం మీడియా మొన్నటి వరకు ఎపిలో హైకోర్టు అప్పుడు అయిపోతుంది.ఇప్పుడు అయిపోతుందని ప్రచారం చేసింది. చివరికి జూన్ ముహూర్తం కూడా ప్రచారం చేసింది. తాజాగా చంద్రబాబు నాయుడు హైకోర్టు విభజనకు తొందర ఏమిటని ప్రశ్నించారు.
ఉమ్మడి హైకోర్టు విభజనను డిసెంబరు వరకు ఆపండి... ఈలోపు ఇక్కడ సిటీ సివిల్‌ కోర్టు భవనం నిర్మాణం పూర్తవుతుందని స్పష్టంగా చెప్పాం. కానీ... వెంటనే విడదీయాల్సిందేనని, ఏపీ హైకోర్టును కూడా హైదరాబాద్‌లో పెడతామని సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసింది. హామీలు అమలు చేయాలని గట్టిగా అడిగితే... చంద్రబాబుకు పరిణతి లేదు, కేసీఆర్‌ పరిణతితో వ్యవహరించారని మోదీ పార్లమెంటులో అన్నారు. ఎంత కసి. ద్వేషం. తెలుగు జాతి మీకాళ్ల దగ్గర ఉండాలా? తెలుగుజాతి మీకు బానిసగా ఉండాలా? అని తీవ్రంగా మాట్లాడారు.

tags : babu, highcourt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info