ప్రస్తుతం సిపిఎం ఆద్వర్యంలో ఉన్న బహుజన లెప్ట్ ప్రంట్ కు జనసేన అదినేత పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తమ ప్రంట్ కు పవన్ మద్దతు ఇవ్వాలని కోరుతూ రెండుసార్లు లేఖలు రాశారు.అలాగే జనసేన పార్టీ నేతలతో ఆయన సంప్రదింపులు జరిపారు. వాటన్నిటిని పరిగణనలోకి తీసుకున్న పవన్ కళ్యాణ్ త్వరలోనే ఈ ప్రంట్ లో భాగస్వామి అవుతారని చెబుతున్నారు. అదే జరిగితే తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలే అవకాశం ఎక్కువ ఉంటుందని,అందువల్ల అది టిఆర్ఎస్ కు ఉపయోగం జరగవచ్చని విశ్లేషణలు వస్తున్నాయి. tags : telangana, front, pawan,cmp