A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగ్గారెడ్డి అరెస్టుపై ఉత్తం మండిపాటు
Share |
January 16 2019, 4:56 am

మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అరెస్టు కాంగ్రెస్ లో కలకలం రేపింది.దీనిపై పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.పోలీసులు ముఖ్యమంత్రి కెసిఆర్ తొత్తుల్లా పనిచస్తున్నారని ఆయన ఆరోపించారు.ముందుగా నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు.సీఆర్‌ మాట విని జగ్గారెడ్డిని అక్రమంగా అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. 2004 లో ఎఫ్ఐఆర్ అయిన కేసు లో ఇప్పుడు అరెస్ట్ చేశామని చెబుతున్న పోలీసులు.. 2004 లో నమోదైన ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ కేసులో కెసిఆర్, హరీష్ రావు లు నిందితులు గా ఉన్నారని వారిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు.కాగా దీనిపై కాంగ్రెస్ బృందం ఒకటి డిజిపి వద్దకు వెళ్లి వినతిపత్రం ఇచ్చింది.

tags : jaggareddy,uttamkumarreddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info