A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ తో పొత్తుపై ఒక్కమాట చెప్పరా
Share |
February 19 2019, 2:20 pm

తెలంగాణలో కాంగ్రెస్‌-టీడీపీ పొత్తు గురించి కనీసం ఒక్క మాటైనా తనతో చెప్పలేదని టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. రిజర్వేషన్ల పేరుతో కాపులను, బీసీలను టీడీపీ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కావాలనే తనను దూరం పెడుతున్నాడని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు జనాభా దామాషా ప్రకారం టికెట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. బీసీలకు ప్రత్యేక పార్టీ పెట్టాలని కోరుతున్నారని వివరించారు. కొత్త పార్టీ పెట్టే విషయం, టీడీపీకి రాజీనామా చేసే విషయం త్వరలోనే వెల్లడిస్తానని కృష్ణయ్య స్పష్టం చేశారు.
2014ఎన్నికల్లో తనను టీడీపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ.. ఏనాడూ కనీస మర్యాద ఇవ్వలేదని ఆర్‌, కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు.కృష్ణయ్య ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత తెలుగుదేశం మీడియా మాత్రం ఈ విషయాలేవీ చెప్పకుండా కృష్ణయ్య తాను టిడిపిలోనే ఉన్నానని చెప్పారని కధనాలు ఇచ్చాయి.

tags : r krishnayya, congress, tdp,alliance

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info