A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మనసు బాష మాట్లాడిన జగన్
Share |
September 22 2018, 3:05 am

విపక్ష నేత,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ మనసు భాష మాట్లాడారు.బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో ఆయన ప్రసంగించారు.
' ప్రతి మనిషిలోనూ మనసు అనేది ఒకటి ఉంటుంది. తప్పు చేస్తున్నప్పుడు ఈ మనసు మనిషితో మాట్లాడుతుంది. అప్పుడు మనసు చెప్పేది వినగలిగితే ఆ మనిషి ఆ తప్పు చేయడు. అలా మనసు చెప్పే మాటను వినకుండా ఆ తప్పును సమర్థించుకోవడం మొదలు పెడతారో అప్పుడు రాజకీయాలు భ్రష్టుపడతాయి. మనషులు భ్రష్టుపడతారు. మనిషి తప్పు చేయకుండా ఉండాలి అంటే కచ్చితంగా దేవుణ్ణి నమ్మాలి. దేవుడు ఏ రూపంలోనైనా ఉండొచ్చు. ఆ దేవుడికీ మనిషికి సంబంధం ఉండాలి. ఆ సంబంధాన్ని నిలబెట్టే విషయంలో మనిషికీ, దేవుడికి మధ్య ఉన్న వారధులు బ్రాహ్మణులు అని చెప్పడానికి గర్వపడుతున్నా."అని ఆయన అన్నారు.ఇతర కమ్యూనిటీల్లో కూడా ఇలాంటి వారధులు ఉన్నారు. చర్చిలో అయితే పాస్టర్లు, ఫాదర్లు అని, మసీదులో అయితే ఇమామ్‌లు అని అంటారు. ఇలా ఎవరిని తీసుకున్నా వీళ్లంతా దేవుడికి, మనిషికి మధ్య వారధులు. వీళ్లు అందరూ సంతోషంగా ఉంటేనే మన శ్రేయస్సుకు సంతోషంగా పని చేసినట్టవుతుంది. ఇవాళ ఒకసారి ఈ వారధుల పరిస్థితిని.. ప్రత్యేకించి ఇది బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం కాబట్టి.. ఇక్కడ వాళ్లకున్న సమస్యలను, పరిస్థితులను పరిశీలిస్తే బాధనిపిస్తుంది. నాకున్న అవగాహనతో చెప్పాల్సి వస్తే వీరి పరిస్థితి దయనీయం. పేదరికంతో అల్లాడుతున్నారు. చదువులు దేవుడిచ్చిన వరం వీరికి. ఆ చదువులతోనే కాస్తోకూస్తో నెట్టుకు వస్తున్నారు. ఇవాళ వీరిలో చదువుకున్న వారికి ఉద్యోగాలు రావడం లేదు. అర్చక వృత్తిని ఎందుకు చేస్తున్నామా.. అని ఆందోళన స్థితిలో ఉన్నారు బ్రాహ్మణ సోదరులు. "అని జగన్ అన్నారు.

tags : jagan,mind,brahmins meet

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info