A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంప్లెక్స్ కూల్చుతా- జెసి హెచ్చరిక
Share |
September 26 2018, 4:14 am

వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఒక అదికారిని బెదిరించారంటూ చకచకా కేసులు పెట్టిన ఎపి పోలీసులు తెలుగుదేశం ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి బెదిరింపులపై మాత్రం పట్టించుకోవడం లేదట. ప్రభాకరరెడ్డి ఆడియో టేప్ లు కలకలం రేపుతున్నాయని వార్తలు వచ్చాయి. తన కమర్షియల్‌ కాంప్లెక్స్‌ను జేసీ కబ్జా చేశారని మల్లిఖార్జున చారి అనే బాధితుడు మీడియా ముందుకు వచ్చాడు. జేసీ ట్రావెల్స్‌ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని బాధితుడు కోరాడు. అయితే ఫిర్యాదులపై జేసీ ప్రభాకర్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సైలెంట్‌గా ఉండకపోతే, ఆ భవనాన్ని కూల్చివేస్తానంటూ బాధితుడికి ఫోన్‌లో హెచ్చరించారట. దీనికి సంబందించిన ఆడియో టేపు కూడా వెలుగులోకి వచ్చింది. జేసీ బెదిరింపులపై తాను కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మల్లిఖార్జున చారి ఆరోపించాడు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. జేసీ కబ్జాలో ఉన్న భవనాన్ని తనకు అప్పగించాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చారి అంటున్నారట. ప్రతిపక్షం వారిపై దూకుడుగా వెళ్లే పోలీసులకు తెలుగుదేశం వారు అంటే అంత భయమా?

tags : jc, chari, complex

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info