A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చెన్నూరు టిక్కెట్ కోసం గృహ నిర్బందం
Share |
September 21 2018, 8:17 am

పార్టీ టిక్కెట్ కోసం ఎంత తంటా పడుతున్నారు.చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు తనకు టిఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వకపోవడంపై నిరసన చెబుతూ తన ఇంటిలో తానే నిర్భందం చేసుకున్నారు.తనకు టిక్కెట్ ఇచ్చేంతవరకు ఇంటి నుంచి బయటకు రానని చెబుతున్నారు.మందమర్రి మూడో జోన్ లోని ఆయన నివాసగృహంలో ఈ నిర్భందం విధించుకున్నారు.ఈ టిక్కెట్ ను ఓదేలుకు బదులుగా పెద్దపల్లి ఎమ్.పి బల్క సుమన్ కు టిఆర్ఎస్ నాయకత్వం ఇచ్చింది.దానిపై ఆయన ఆవేదనతో ఈ నిరసన కు దిగారు.ఆయన తో పాటు భార్య భాగ్యలక్మి,కుమారుడు సందీప్,కుమార్తె, జ్యోత్స్న,తల్లి పోసవ్వ కూడా ఉన్నారు.స్థానిక టిఆర్ఎస్ కార్యకర్తలు ఆయనకు నచ్చ చెప్పే యత్నం చేస్తున్నారు.

tags : telangana, chennuru, tickets

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info