A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగ్గారెడ్డిపై పక్కా ఆధారాలు ఉన్నాయి
Share |
September 22 2018, 7:36 am

మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పక్కా ఆధారాలతోనే అరెస్టు చేశామని డిసిపి సుమతి ప్రకటించారు. మనుషుల అక్రమ రవాణ అబియోగంపై జగ్గారెడ్డిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
గుజరాత్‌కు చెందిన ముగ్గుర్ని కుటుంబ సభ్యుల పేరుతో అక్రమంగా అమెరికాకు పంపారని, దీనికి వారి నుంచి రూ. 15 లక్షలు తీసుకున్నారని ఆమె వెల్లడించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే జగ్గారెడ్డిని అరెస్ట్‌ చేశారన్న ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు.సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ కు వచ్చినపిర్యాదుపై నిశితంగా దర్యాప్తు చేశామని ఆమె తెలిపారు. 2004లో ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి కుటుంబ సభ్యుల పేర్లతో అక్రమంగా పాస్‌పోర్ట్‌లు పొందారని, ఎమ్మెల్యే లెటర్‌ హెడ్‌తో పాస్‌పోర్టులు ఇవ్వాలని కోరారన్నారు. ఈ నకిలీ పాస్‌పోర్ట్‌లతో వీసాలు పొందారని, భార్య ఫొటో, కుమార్తె, కుమారుడు పుట్టిన తేదీల మార్పిడి జరిగిందన్నారు. ఆధార్‌ డేటా ఆధారంగా ఈ అక్రమాలను గుర్తించినట్లు స్పష్టం చేశారు. జగ్గారెడ్డి కుటుంబ సభ్యుల ఆధార్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు ఆమె వివరించారు.

tags : jaggareddy,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info