A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు కొత్త పల్లవి
Share |
January 16 2019, 5:57 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త పల్లవి అందుకున్నారు.రెండు తెలుగు రాష్ట్రాల మద్య తగాదాలు పెట్టడానికి కేంద్రం యత్నిస్తోందని ఆయన అంటున్నారు.ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య అపోహలు పంచాలని ప్రదాని మోడీ చూశారని ఆయన ఆరోపించారు.రాజకీయంగా టిడిపిని ఒంటరి చేయాలని చూశారని, పార్టీని బలహీనపరచాలని ప్రయత్నించారని ఆయన అన్నారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని కోరినవాళ్లే లోక్‌సభకు గైర్హాజరు అయ్యారని... దిల్లీకి వస్తామని చెప్పినవాళ్లు పత్తాలేకుండా పోయారని అన్నారు. రాష్ట్రాల్లో సమర్ధ నాయకత్వం లేకుండా చేయాలని కేంద్రం కుట్రలు చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని కేంద్రం ఎందుకు పూడ్చడం లేదని ప్రశ్నించారు. పనిలో పని వైఎస్ ఆర్ కాంగ్రెస్ మీ కూడా ఆయన విమర్శలు చేశారు.ఈ మేరకు టెలికాన్పరెన్స్ లీక్ ఇచ్చారు.

tags : chandrababu, leaks

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info